andhra pradesh group exams

Responsive Ads Here

Wednesday, April 18, 2018

Fundamental Duties-Indian Constitution part1 in Telugu

Fundamental Duties-Indian Constitution in Telugu

విధులు అర్థ వివరణ

 "విధి" అనగా ఒక వ్యక్తి ఇతరులకోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత అని అర్థం. సామాజిక జీవనంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం అనేవి ఉదాత్తమైన మానవీయ పరిపక్వతా లక్షణాలుగా పేర్కొంటారు. సమాజం ద్వారానే వ్యక్తి అన్ని లక్షణాలను, స్వభావాలను అలవర్చుకుంటాడు. అలాగే, అనేక ప్రయోజనాలు పొందుతాడు. కనుక ప్రతి వ్యక్తి తన సమాజానికి కనీస సేవలను, సహాయాన్ని తిరిగి అందించాల్సిన బాధ్యత ఉంటుంది.

విధుల ప్రాముఖ్యత

విధులు సమాజ వికాసం, దేశాభివృద్దికి, సామాజిక సృహ కల్పించడానికి దోహదం చేస్తాయి. దేశ ఐక్యతను, సమగ్రతను పెంపొందిస్తాయి. ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం ఫలప్రదం అవుతుంది. 

విధులు - రకాలు
 సాధారణంగా విధులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.
1.నైతిక విధులు
2.చట్టబద్ధమైన విధులు.

 నైతిక విధులు అనగా ప్రజల యొక్క నైతిక విలువలపై, సామాజిక స్పృహపై ఆధారపడి. ఉదాహరణకు, పెద్దలను మరియు ఉపాధ్యాయులను గౌరవించడం, అభాగ్యులను, విధివంచితులను ఆదుకోవడం, మొదలగునవి.
చట్టబద్ధమైన విధులు అనగా సమాజంచేత ఆమోదించబడి, ప్రభుత్వంచేత గుర్తించబడిన బాధ్యతలు. నీటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. ఉదాహరణకు, ట్రాఫిక్ నియమాలను పాటించడం, సన్నులను సక్రమంగా చెల్లించడం, మొదలగునవి

ప్రతి పౌరుడు దేశంపట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది, వీటికి గొంగ ప్రతిపత్తి కల్పించడం చేత వీటిని ప్రాథమిక విధులు అంటారు.

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు -
వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. ఐతే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని 4-A భాగం, నిబంధన 51-Aలో పొందువరిచారు. ప్రారంభంలో వది ప్రాధమిక విధులు ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వీటి సంఖ్య పదకొండుకు పెరిగింది. జనవరి 3, 1977 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా పరిగణిస్తారు.

ప్రాథమిక విధులు - లక్షణాలు
ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
• ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఇవి నేరుగా అమలులోకి రావు.
వీటి అమలుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి.
 • ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని పౌర బాధ్యతలు.
• కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సాంప్రదాయాలు, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు.

ప్రాథమిక విధులు 

51(A)
a) రాజ్యాంగానికి కట్టుబడి ఉండి, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించటం
b) జాతీయ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం
c) భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించటం
d) దేశరక్షణకు, జాతీయ సేవకు సదా సన్నద్ధంగా ఉండటం 
e) భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ, వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని, స్ఫూర్తిని పెంపొందించటం,స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను త్యజించటం
 f) భారత మిశ్రమ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, సంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించటం
g) అడవులు, సరస్సులు, నదులు వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడటం, అభివృద్ధి చేయటం,జీవులపట్ల కారుణ్యం కలిగి ఉండటం
h) శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం
i) ప్రజల ఆస్తిని సంరక్షించడం, హింసను విసర్జించడం
j) తమ వ్యక్తిగత, సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడటం.

k) 6 నుంచి 14 సం. లోపు గల తమ పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు నిర్వర్తించడం.



















Fundamental Duties-Indian Constitution in Telugu



No comments:

Post a Comment